Ponguleti Srinivasa Reddy: సస్పెన్ష్‌కు తెరదించిన పొంగులేటి.. అమిత్ షా ఖమ్మం రాకముందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy: బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీజేపీలో చేరతారా, కాంగ్రెస్‌లో చేరతారా అని రెండు నెలల పాటు ఊగిసలాట ధోరణి కనబర్చారు.. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో.. ఆ పార్టీవైపే మొగ్గు చూపారు. ఈ ఏడాది జనవరి 1న కేసీఆర్ సర్కార్‌పై పొంగులేటి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిరసన స్వరం పెంచారు. దీంతో ఆ పార్టీ పొంగులేటిని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేశాక మరింతగా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేశారు పొంగులేటి. బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానీయకుండా చూడడం, కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటున్న పొంగులేటి.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్లను తాకనీయనంటూ శపథం కూడా చేశారు.
Read Also: Amit Sha Tour: రేపు హైదరాబాద్ కు అమిత్ షా.. రాజమౌళి పలువురు ప్రముఖులతో భేటీ..!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఇక, ఈటల రాజేందర్‌తో ఉన్న అనుబంధంతో తొలుత పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కొంతకాలానికి బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో కలిసి కొత్త పార్టీ పెడతారని టాక్ వినిపించింది. కానీ, కర్ణాటక ఫలితాల ప్రభావంతో క్రమంగా కాంగ్రెస్ వైపు చూపారు. సునీల్ కనుగోలు.. చర్చలు జరిపి పొంగులేటి కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేయగలిగారు. పార్టీలో పొంగులేటికి మంచి పొజిషన్ ఇవ్వడమే కాకుండా, ఆయన అనుచరులకు సీట్లు ఇచ్చే విషయంలోనూ హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు పొంగులేటి. బుధవారం మంచి రోజు కావడంతో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Varahi Yatra: వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. అన్నవరానికి జనసేనాని
2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెల్చిన పొంగులేటి, ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా నాటి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. అప్పట్నుంచి కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. గత నెలలో పొంగులేటిని పార్టీలో ఆహ్వానించడానికి ఆయన ఇంటికి బీజేపీ కీలక నేతలంతా వెళ్లారు. సో.. కాంగ్రెస్ నేతలు కూడా ఆ తరహాలోనే వెళ్లనున్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఆహ్వానించాక.. పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యమంటున్న పొంగులేటి.. ఆయా నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు కోరుతున్నారు. మధిర, భద్రాచలం సిట్టింగ్ కాంగ్రెస్ సీట్లు తప్ప మిగిలిన సీట్లు అన్నీ తన వర్గం వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సర్వేల ప్రాతిపదికన సీట్లను ఇస్తామని చెబుతూనే, పొంగులేటికి సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామని సునీల్ కనుగోలు హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో చేరికకు లైన్ క్లియర్ అయ్యింది.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!