దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లనే తాగాల్సి రావొచ్చు. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే.
Sanjay Raut: 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. ఉద్దవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. శనివారం నాందేడ్ లో జరిగిన అమిత్ షా ర్యాలీని సంజయ్ రౌత్ ప్రస్తావసి్తూ.. ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం విశేషం…
పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కూ.315 కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆయన తెలిపారు.
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చని తెలిపారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
Sachin Pilot: రాజస్థాన్‌లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.