Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
BJP-JAC: నేడు మంత్రి కేటీఆర్ ములుగు పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు JAC నాయకులు ముందస్తు అరెస్ట్ కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పలువురు JAC, బీజేపీ, BJYM నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కరెంట్పై డెవలప్మెంట్ ఛార్జీలు వేసి ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు.
ఆదివారం భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
Bandi Sanajay: రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.