మోడీ దేశానికి యజమాని కాదని, సేవకుడు మాత్రమేనని అని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చూగ్. జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఓటర్లను కలిసేందుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వచ్చారు. ఆల్విన్ కాలనీ డివిజన్ శాతావహన హిల్స్ లోని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చిన తరుణ్ చూగ్ ప్రధాని నరేంద్రమోడీ 9ఏళ్ల పాలనలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రేమ్ కుమార్ కు వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల ద్వారా దేశ ప్రజలకు సేవ చేస్తున్నారని వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: అమరావతే రాజధానిగా ఉంటుంది.. నన్ను గెలిపించి ఉంటే దోపిడీ ఆపేవాడిని..
భారతదేశం పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుందని, భారత్ విశ్వ గురువుగా మారిందని తరుణ్ చూగ్ వెల్లడించారు. అంతేకాకుండా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యులను 125 మందిని నియమించామని, అలాంటిది ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చడమనే అంశం లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన వెల్లడించారు. నేతలంతా కలిసికట్టుగా ఎవరి పని వారు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. తుఫాన్ కారణంగా ఖమ్మం బహిరంగ సభను వాయిదా వేశామని ఆయన తెలిపారు. త్వరలోనే సభకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని వెల్లడించారు తరుణ్‌చుగ్.
Also Read : Minister KTR : ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది