తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం వెలుగులు జిమ్మితే పంటి, కంటి నొప్పికి సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని, సర్పంచ్ నుండి సీఎం దాకా ఎవరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం లేదన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు పుట్ట గొడుగుల్ల పుట్టుకొస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. 56 శాతం డెలివరీ లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎందుకు జరుగుతున్నాయని, సంవత్సరానికి 6 వేల కోట్ల cmrf కు ఎందుకు ఇస్తారన్నారు.
Also Read : TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
ఆయిష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్ నిధులు కేంద్ర ప్రభుత్వంవేనని ఆయన అన్నారు. వరంగల్, నిమ్స్ హాస్పటల్ ల కోసం భూములను కుదువ పెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణ స్టేట్ సూపర్ స్పెషాలిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భూములను కుదువ పెట్టీ అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించక పోవడంతో హాస్పిటల్స్ పేషంట్స్ ను అడ్మిట్ చేసుకోవడం లేదని ఆయన అన్నారు.
Also Read : Rajamouli: ‘జక్కన్న’తో అమిత్ షా మీటింగ్ ఎందుకబ్బా?