21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.
Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీరియస్‌గా ముందుకు పోతోంది. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ... తీగలు ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే... బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది. దీంతో... ఆ పార్టీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మా ఫోన్ కాల్స్‌ని కూడా వినేశారు.
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నాలుగు దశాబ్దాలకు పైగా టిడిపితో అనుబంధం ఉన్న నల్లమిల్లి... తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈసారి కాషాయ కండువా కప్పుకున్నారు. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగుతూ అదే పార్టీ తరపున నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసన సభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దామని కోరారు. మీరు ఎప్పుడు కలిస్తానని చెప్పిన అప్పుడు వచ్చి కలుస్తానన్నారు.
CM Chandrababu: యోగాంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏపీ సర్కార్ తీసుకుందని చెప్పుకొచ్చారు.