Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉత్పాదక రంగానికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా తొలిసారి ఉద్యోగాల్లో చేరే వారికి ప్రోత్సాహకాలు.. మొదటి సారి ఉద్యోగంలోకి వచ్చే వారికి రెండు విడతలుగా రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి 6 నెలలు పూర్తయ్యాక మొదటి కిస్తీ, 12 నెలల పూర్తయిన తర్వాత రెండో కిస్తీ.. వస్తూత్పత్తి రంగంలో అదనపు ఉద్యోగాల కల్పన కోసం, యజమానులకు రెండేళ్ళ పాటు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: Fake Student: ఐఐటీ బాంబేలో చొరబాటుదారుడి కేసులో కీలక విషయాలు.. ఉగ్ర కోణంలో విచారణ..
ఇక, రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో, దేశంలోని 4 కోట్ల 10 లక్షల మంది యువతకు నైపుణ్యం, ఇతర అవకాశాలు, ఉద్యోగాల కల్పన కోసం 2024-25
కేంద్ర బడ్జెట్ లో ప్రధాని మోడీ ప్యాకేజీతో కూడిన ఐదు పథకాలను ప్రకటించారని కేంద్రమంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్ళలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కొత్త పథకం తీసుకొచ్చాం. దేశంలో కొత్తగా కల్పించే మూడున్నర కోట్ల ఉద్యోగాల్లో, తొలిసారిగా ఉద్యోగాలు పొందే వారి సంఖ్య ఒక కోటి 92 లక్షల మంది.. రూ.1 లక్షలోపు జీతాలు వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.. ఉద్యోగాలు కల్పించే యజమానులకు 2ఏళ్ళ పాటు ప్రతి నియామకానికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. కనీసం 6 నెలల పాటు యజమానులు వారి వారి సంస్థల్లో ఉద్యోగాలను కొనసాగిస్తామన్నారు.
Read Also: Prabhas: ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?
అలాగే, వస్తూత్పత్తి రంగంలో మాత్రం యజమానులకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని మూడు, నాలుగో ఏడాది వరకు కొనసాగింపు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ సంస్థలో నమోదు చేసుకుని, 50 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఐదుగురు ఉద్యోగులను అదనంగా నియమించి, కనీసం 6 నెలల పాటు కొనసాగించాలని నిబంధన ఉంది. ఇక, తయారీ రంగంలో నాలుగేళ్ల వరకూ ప్రోత్సాహకాల పొడిగింపు ఉంటుంది. ఉద్యోగుల జీతాల స్థాయిని బట్టి ఉద్యోగదారులకు ప్రోత్సాహకాలు అందిస్తాం.. ఉద్యోగులకు “ఆధార్ అనుసంధాన చెల్లింపు విధానం” ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి.. ఉద్యోగాలు కల్పించే యజమానులకు “పాన్ అనుసంధాన బ్యాంకు అకౌంట్ల”లో నగదు ప్రోత్సాహకాలు జమ చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: రౌడీలతో పోరాటం చేస్తున్నా.. వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం..!
అయితే, పరమక్కుడి – రామనాథపురం (NH-87) 4 లైన్ రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. మొత్తం వ్యయం రూ.1,853 కోట్లు – 46.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) ద్వారా రహదారి అభివృద్ధి.. ప్రధాన నగరాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుంది. మదురై, పరమక్కుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోడి మధ్య మెరుగైన అనుసంధానం కల్గుతుంది. సతిరకుడి, అచున్దన్వాయల్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. రహదారి విస్తరణ వల్ల రహదారి భద్రత, వేగం పెరుగుతుంది.. ఐదు జాతీయ రహదారులను, మూడు రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. NH-38, NH-85, NH-36, NH-536, NH-32తో అనుసంధాన ప్రాజెక్ట్ కొనసాగుతుంది. అలాగే, SH-47, SH-29, SH-34తో అనుసంధానం చేయబడుతుంది. మదురై, రామేశ్వరం రైల్వే స్టేషన్లు – మదురై విమానాశ్రయం – రెండు మైనర్ పోర్టులకు అనుసంధానం చేస్తున్నాం.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి పునాది వేస్తున్నాం.. రామేశ్వరం, ధనుష్కోడి టూరిజానికి ప్రోత్సాహం.. వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు.. ముడి వస్తువులు, ప్రయాణికులు వేగవంతమైన రవాణాకు అనుకూలం.. ఉద్యోగ సృష్టిలో భారీ అవకాశం.. 8.4 లక్షల ప్రత్యక్ష, 10.45 లక్షల పరోక్ష ఉపాధి దినాలు.. ప్రాంతీయ అభివృద్ధికి దారితీసే ప్రాజెక్ట్ అని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.