Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా… ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్. మామూలుగా అయితే, కూటమి భాగస్వాములుగా… జనసేన, బీజేపీ కూడా కలిసి ఇంటింటికి నడవాలి. కానీ, ఇప్పుడా విషయంలో అనుమానపు చూపులు మొదలయ్యాయట. ఈ కార్యక్రమంలో.. జనసేన, బీజేపీ యాక్టివ్‌గా పాల్గొంటాయా? లేదా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి… అత్యంత సమన్వయంతో పనిచేసి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఏదో తేడా జరిగిపోయిందని కాదుగానీ… అంటూ సణుగుతున్నారట కొందరు పొలిటికల్ పరిశీలకులు.
Read Also: Off The Record: వార్ లో జూనియర్ కొండా!
ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే…. ఆ విషయంలో తెలుగుదేశం నాయకులే ముందున్నారని, మిగతా ఇద్దరు ఎందుకు యాక్టివ్‌గా లేరన్నది వాళ్ళ క్వశ్చన్. అటు ఇంటింటికి కార్యక్రమంపై జనసేన, బీజేపీలో చర్చ నడుస్తోందట. మూడు పార్టీల నాయకులు కలిసే వెళ్లాలా..లేక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారా అన్నది అందులో మెయిన్ పాయింట్‌గా చెబుతున్నారు. అదే సమయంలో…. ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా… అంతా కలిసి వెళితేనే మంచిదన్న అభిప్రాయం మిగతా భాగస్వాముల్లో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారని ఎక్కడా చెప్పలేదని, కూటమి మొత్తం ప్రజల దగ్గరికి వెళుతోందన్న అభిప్రాయం ఉందని మాట్లాడుకుంటున్నారు పలువురు నాయకులు. ఈ క్రమంలోనే…జనసేన బీజేపీ కూడా కలిసి వెళితేనే నిండుదనం ఉంటుందని, బయటికి కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది అన్ని వర్గాల్లో. ఇక్కడే ఇంకో టెక్నికల్ పాయింట్‌ని లేవనెత్తుతున్నారు కొందరు.
Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఇంటింటికి టిడిపి నేతలు లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, దాన్ని బట్టి చూస్తే… మిగతా రెండు పార్టీలు వెళ్తాయా లేదా అన్నది వాళ్ళ డౌట్. ఎవరు ఔనన్నా, కాదన్నా, ఏపీ వరకు కూటమిలో పెద్దన్న పాత్రలో ఉంది టీడీపీ. జనసేన, బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బహుశా అందుకే ముందు టీడీపీ అభిప్రాయం చెప్పి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్. ఇక జనసేన, టీడీపీ మధ్య క్షేత్ర స్థాయిలో అక్కడక్కడా విభేదాలు ఉన్నా.. వాటిది బంధం మీద ప్రభావం చూపే స్థాయి కాదని, అందుకే పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కలిసే వెళ్దామన్నది జనసేన, బీజేపీ అభిప్రాయంగా తెలుస్తోంది. మంచైనా, చెడైనా, తమ ఎమ్మెల్యేలు కూడా జనంలోకి వెళ్తే బాగుంటుందన్నది ఆ రెండు పార్టీల పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో…. టీడీపీ మిగతా రెండు భాగస్వామ్య పార్టీలను కలుపుకుని వెళ్తుందా? లేక సోలో సాంగ్ పాడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.