Rekha Gupta: 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం బంగ్లాకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!
- 5 టీవీలు, 14 ఏసీలు
- రూ.60 లక్షలతో ఢిల్లీ సీఎం బంగ్లాకు మరమ్మత్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక… ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్‌లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే బంగ్లా మరమ్మత్తుల కోసం రూ.60 లక్షలు కేటాయించబడ్డాయి. జూన్ 28న జారీ చేసిన టెండర్‌లో రూ.60 లక్షలు కేటాయించినట్లు వెల్లడైంది. ఇందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు ఏర్పాటు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: GST: మధ్యతరగతికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం..
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) జారీ చేసిన టెండర్ నోటీసు ప్రకారం.. మరమ్మత్తు పనులు 60 రోజుల్లో పూర్తి కానున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా జరగనున్నాయి. ఇందుకోసం జూలై 4న టెండర్ కోసం బిడ్‌లు తెరవబడనున్నాయి. ముఖ్యమంత్రి రెండు బంగ్లాలు కేటాయించారు. నివాసం ఉండటానికి బంగ్లా నెంబర్ 1ను ఉపయోగించనున్నారు. బంగ్లా-2ను క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించనున్నారు. రెండు బంగ్లాలో రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. రూ.5.74 లక్షలతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే రూ.2లక్షల విలువైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం యూపీఎస్ వ్యవస్థ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Naga Vamsi : వార్2 తెలుగు స్టేట్స్ రిలీజ్.. నాగవంశీ విధ్వంసం
ఇక అదనంగా రూ.1.8లక్షలతో రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యానులు, రూ.85,000లతో ఓవెన్ టోస్ట్ గ్రిల్, రూ.77,000లతో ఒక ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, రూ.60,000లతో డిష్‌వాషర్, రూ.63,000లతో గ్యాస్ స్టవ్, రూ.32,000లతో మైక్రోవేవ్‌లు, రూ.91,000లతో ఆరు గీజర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక రూ.6,03,939 వ్యయంతో ఇంట్లో మొత్తం 115 దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెండర్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేఖా గుప్తా.. కేజ్రీవాల్ నివాసం ఉన్న 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని వివాదాస్పద బంగ్లాలో నివసించబోనని తేల్చి చెప్పారు. అది ‘‘శీష్‌మహల్’’ అంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. కోట్ల ఖర్చు చేసి విలాసవంతంగా నిర్మించారంటూ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!