Bandi Sanjay : కరీంనగర్లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు…
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించినా.. కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే, సీబీఐ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పమవుతోంది. రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఒక ఎత్తయితే.., నియోజకవర్గంలో ఆయా నేతల అనుచరుల ఆగడాలు మరో ఎత్తు అంటున్నారు స్థానికులు. అరాచకాలు ఆధారాలతో లహా బహిర్గతం కావడం, భూ కబ్జాలాంటి ఆరోపణలు, నెలవారీ మామూళ్ల కోసం బెదిరింపులు,
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.