RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయి.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది.. అయితే, ఇప్పటికీ ఆ నాటి ఎన్నికల, ఫలితాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.. మరోసారి అదే అంశాన్ని లేవనెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
Read Also: Pakistan: భారత్ దెబ్బతో చైనా ఆయుధాలను నమ్మలేకపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..
ఇక, కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకు జగన్ అన్న సాయం చేశారని గుర్తుచేశారు రోజా.. ఈ నెల 9వ తేదీన మామిడి రైతుల కోసం వైఎస్ జగన్ వస్తున్నారు అని తెలియగానే ఒక అలజడి మొదలైంది.. సీఎం చంద్రబాబు ఇదే జిల్లా వాసి అయినప్పటికీ మామిడి రైతుల కష్టాలు తెలియనట్లు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. ఇదే జిల్లాలో పుట్టి పెరిగావు, నీ వయసు ఎంత..?. రైతులకు అన్యాయం జరుగుతుంటూ నీకు తెలియడం లేదా..? అని నిలదీశారు.. సొంత జిల్లాలో రైతులకు ఏమి చేయని దౌర్భాగ్య స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఫైర్ అయ్యారు..
Read Also: Piracy : పైరసీ చేసి 50 లక్షలు సంపాదించిన కిరణ్ ..ప్రైవేటు వీడియోలు కూడా ?
మరోవైపు, మామిడి రైతులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారు అని ఆరోపించారు రోజా.. వ్యవసాయ మంత్రి ఎక్కడెక్కడో ఉండి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మాట్లాడటం కాదు.. చిత్తూరు జిల్లాకు వస్తే రైతులు పాతేస్తారు అంటూ హెచ్చరించారు.. త్వరలోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు అంటూ జోస్యం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..