Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పదవి నుంచి తొలగించడానికి భారతీయ జనతాపార్టీలో కుట్ర జరుగుతోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదని అన్నారు.
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది.... టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో.... రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం... ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని,
Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. నిత్యం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో శశిథరూర్ పార్టీ మారడం ఖాయమని పొలిటికల్గా అందరూ ఫిక్స్ అయిపోయారు.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
శ్రీశైలం జలాశయానికి పోటేత్తిన వరద గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. ఇప్పటికే…
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్,…