PM Modi: మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేటి (జూన్ 9న)కి ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో తన 11 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నారు.
Tamil Nadu BJP: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా "సైలెంట్ ఆపరేషన్" నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు.
Amit Shah: తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు.
Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుండి ఆగష్టు 5 వరకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు సీడ్ బాల్ తయారీ చేయాలన్నారు. జూన్ 23 శ్యామ్…
Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.
ECI: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన…
Konda Vishweshwar Reddy: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది.. చేవెళ్ళకు ఒక చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం మాయమాటలు కాంగ్రెస్ చెప్పింది.. కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తారు అనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారు.. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది.
నా 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పిన సమాధానాలు చూసి బాధ, అనుమానం వ్యక్తమయ్యాయి.. నేనే సుమోటోగా కాళేశ్వరం కమిషన్ కు సబ్ కమిటీ రిపోర్టు, ఇతర వివరాలు అందిద్దామని అనుకుంటున్నాను.