Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరోజే బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రరావు..
- శనివారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రరావు..
- గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన తర్వాత పార్టీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ..
- ఎల్లుండి ఉదయం 10 గంటలకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనంతరం చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారని కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇటీవల తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
Read Also: Telangana Govt: అంగన్వాడి హెల్పర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
అయితే, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే రామచంద్రరావును పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కానీ, రామచంద్రరావు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యుల బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ తీసుకోలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు కమలం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రామచంద్రారావుకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రామచంద్రరావు.. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన శనివారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..