ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను నమ్ముకున్నాడు.. హుజురాబాద్ లో ఎమ్మెల్యే ప్రోటో కాల్ విస్మరించారు అని ఆయన ఆరోపించారు.
పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పేర్కొన్నారు. తన పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని ఆయన చెప్పారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది అంటూ ఆయన తెలిపారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పకుంటే.. ఆయన పర్యటనలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా..? అని ప్రశ్నించారు.
Kerala serial blasts: కేరళలో ఆదివారం జరిగిన వరస పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటికే ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కలమస్సేరిలో జరిగే ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల కేరళలో పాలస్తీనా, హమాస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల అనంతం పేలుళ్లు సంభవించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
BJP Leader Vishnu Kumar Raju Fires on YCP MP Vijaysai Reddy: జనసేన-టీడీపీ కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ కలవాలని, రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు అసలు బుద్ది ఉందా? అని విష్ణుకుమార్ రాజు…
Rahul Gandhi: ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలపై హమీల వర్షం కురిపించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గడ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
లాగిన్ వివరాలు ఇచ్చిన విషయాన్ని ఆమె సమర్థించుకున్నారు. తాను మారుమూల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకనే ఈ వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనకు ఓటీపీ వస్తుందని, నా ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని చెప్పారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లు నిర్వహించే ఎన్ఐసీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని చెప్పారు.
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీసీలు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయనతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, big news, brs, bjp,