Pallapu Govardhan: బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ చిక్కుల్లో పడింది. తెలంగాణ బీజేపీలో మంచి ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతోనే సమస్య మొదలైంది. ఆయన ఉద్వాసన తర్వాత మొదలైన రాజీనామాల పర్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కొనసాగుతోంది. బీజేపీ గెలుపుపై నమ్మకం లేక కొందరు పార్టీని వీడుతుండగా.. మరికొందరు టికెట్ రాకపోవడంతో పార్టీని వీడుతున్నారు…మరికొందరు పార్టీలు వారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మరో కీలక నేత బీజేపీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ బీజేపీకి రాజీనామా చేశారు. వెంటనే మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావు ఆయనను బీఆర్ ఎస్ కు ఆహ్వానించారు. దీంతో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గోవర్ధన్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. వడ్డెర సామాజికవర్గానికి చెందిన గోవర్ధన్ రాజీనామా హైదరాబాద్ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇదిలావుంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో పల్లపు గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయతీ, నిస్వార్థంతో పార్టీ కోసం కష్టపడే తనలాంటి నేతలకు బీజేపీలో స్థానం లేదని అర్థమైంది. హిందుత్వం కోసం వెతుకుతున్న తనలాంటి యువకులకు బీజేపీ అండగా ఉంటుందన్న నమ్మకం ఉందని గోవర్ధన్ అన్నారు.
బీజేపీలో భవిష్యత్తు ఉండదని తనలాంటి యువత, బీసీ నేతలు ఇటీవలే గ్రహించారని పల్లపు ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తానని ప్రకటించారని… కానీ ఎన్నికల్లో గెలిచే దమ్ము, సత్తా ఉన్న తనలాంటి యువ నేతలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. టిక్కెట్లు ఇవ్వకుంటే కనీసం పిలిచి మాట్లాడే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. అందుకే ఇక ఆత్మగౌరవం దిగజారలేననే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. 22 ఏళ్లుగా తల్లిలా ప్రేమించిన బీజేపీని వీడడం బాధాకరమని గోవర్ధన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీని వీడిన గోవర్ధన్ నేడు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన చేరిక కార్యక్రమం జరగనుంది. తన అనుచరులతో పాటు మరికొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పల్లపు గోవర్ధన్ భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకుని బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
BSNL Diwali Offer: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!