Telangana Elections 2023: బీజేపీ జాబితాలో లేని కిషన్ రెడ్డి, లక్షణ్ పేర్లు.. ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. త్వరలో నామినేషన్లు వేయనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. నిన్న బీజేపీ మూడో జాబితాను కూడా విడుదల చేసింది. అయితే, ఈసారి బీజేపీ జాబితాలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఈసారి బరిలో లేరు. తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. కె. లక్ష్మణ్ గత 28 ఏళ్లలో బీజేపీ నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గత 24 ఏళ్లలో ఆరుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలిచారు.
ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మణ్ అప్పుడు ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి టి. మణెమ్మ చేతిలో ఓడిపోయారు. లక్ష్మణ్ వరుసగా 1994, 1999, 2009, 2014, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు. 1999, 2014లో గెలిచారు.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 1999లో కార్వాన్ నుంచి కూడా ఓడిపోయారు.కానీ, మొత్తం ఐదుసార్లు పోటీ చేశారు. మూడుసార్లు గెలిచాడు. 1999లో ఓడిపోయిన ఆయన 2004లో హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో హిమాయత్ నగర్ రద్దయింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేశారు. గెలిచారు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి బీజేపీ తన అభ్యర్థుల్లో ఓసీల కంటే బీసీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దించకపోవడం వెనుక వ్యూహం ఏమిటో వేచి చూడాల్సిందే.
Friday : మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికి ఉండాలంటే పొద్దున్నే లేవగానే ఈ పని చెయ్యాల్సిందే..
Also Read
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?