Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమికి తొలిసమావేశాన్ని నిర్వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో మొదట ఉన్న పురోగతి, ఊపు ఇప్పుడు లేదని దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉందని, దీంతోనే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని ఆయన అన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: North Korea: టెర్రర్ గ్రూపులకు నార్త్ కొరియా ఆయుధాలు.. విక్రయించేందుకు కిమ్ ప్రయత్నం..
‘బీజేపీ హటావో, దేశ్ బచావో’(బీజేపీని అధికారం నుండి తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి) అనే థీమ్‌తో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో జేడీ(యు) నాయకుడు ఈ వ్యాఖ్య చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర నాయకులు హాజరయ్యారు. కేంద్రంలోని ప్రస్తుతం పాలనను వ్యతిరేకించే పార్టీతో కలిసి కొత్త కూటమి ఏర్పాటే చేశామని నితీష్ కుమార్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పాత్రను కట్టబెట్టామని, అయితే వారు ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే తదుపరి సమావేశానికి పిలుపునిస్తారని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది ఆ పార్టీ నేత షెహజాద్ పూనావాలా.. ‘‘తుక్డే తుక్డే’’ కూటమిగా అభివర్ణిస్తూ, రాహుల్ గాంధీ ‘ఇండియా’ జోడో యాత్ర చేయాలని కూటమిని ఉద్దేశించి ఎక్స్‌లో విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!