Nirmala Sitharaman: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగిస్తూ.. పెద్ద ఎత్తున బడ్జెట్‌లో పెట్టి స్కీంలకు డబ్బు ఇస్తున్నారని.. స్కీంలు అందని లబ్ధిదారులకు కూడా అందించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నవంబరు 15 నుంచీ ప్రతీ పంచాయతీకి పథకాలు వెళ్ళేలా ఏర్పాటు చేశామన్నారు.
Read Also: Assam: “అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం”.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత ఆగ్రహం..
మోడీ గ్యారెంటీ వ్యాను ద్వారా అన్నీ అందేలా చేస్తున్నారని.. బ్యాంకు అకౌంటుకు డబ్బులు సరాసరి వెళ్ళేలా అకౌంట్లను ప్రతీఒక్కరికీ ఇప్పించారన్నారు. అకౌంటు వాడటం తెలియని వారికి బ్యాంకు మిత్ర ద్వారా ఒకరు వచ్చి కేంద్రం ఇచ్చిన సొమ్ము తెచ్చిచ్చారన్నారు. మోడీ ఓ స్కీం మొదలెడితే చాలా ఫలితాలుంటాయని.. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి ఈ స్కీంలు ఉపయోగపడతాయన్నారు. మోడీ గ్యారెంటీ ద్వారా అందరికీ పథకాలు అందుతాయన్నారు. నానో ఫర్టిలైజర్ వినియోగించడం అందరికీ తెలియాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Read Also: Free RTC: తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మోడీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచ దేశాలలో ప్రత్యేక స్థానం తీసుకొచ్చారన్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గొప్పగా పని చేస్తూ ఆదర్శంగా నిలిచారని.. మహిళలకు అవకాశం ఇవ్వడంలో మోడీ, జగన్‌లు ముందుంటారని వ్యాఖ్యానించారు. హోంశాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చారని మంత్రి చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నేడు ఇక్కడ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు పథకాలపై అవగాహన చేసుకుని, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.