తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు…
Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
Chhattisgarh: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ తెలంగాణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 54 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ అధికారం కోల్పోయి 35 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
Anurag Thakur: బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ గెలుపును ఉద్దేశిస్తూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణ భారత దేశంలో గెలవదని డీఎంకే పార్టీ ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.
Gaumutra remark: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ‘‘బీజేపీ హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో, అంటే మేము వీటిని గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని వాటిలోనే గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తునే ఉన్నాం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
BJP MPs Resign: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను నిర్ణయించే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న సీఎంలు మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
BJP CM: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి, కొత్త నాయకుడిని ఎన్నుకోవడం కోసం బిజెపి నాయకత్వం మూడు రాష్ట్రాల నుండి విస్తృతమైన అభిప్రాయాన్ని సేకరిస్తోంది.