బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని ఈటల పేర్కొన్నారు. మోడీ భారత ప్రజానీకానికి భద్రత, భరోసా ఇవ్వడమే కాకుండా భారత చిత్ర పటాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. 2014 వరకు ఎంత అభివృద్ది జరిగింది.. 2014 నుండి 2023 వరకు అంతకన్నా ఎక్కువ అభివృద్ది జరిగిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వీప్ చేయబోతుంది.. బీజేపీకి కేంద్రంలో 4 వందలకు పైగా సీట్లు వస్తాయని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Bhavya Bishnoi: ఐఏఎస్‌తో పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ మాజీ ప్రియుడు.. 3 లక్షల మందికి ఆహ్వానం!
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ.. ఎంఐఎంతో అంటకాగే ఏ పార్టీకి బీజేపీ మద్దతు ఇవ్వదని తేల్చిచెప్పారు. కడియం శ్రీహరి మాటలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. రేవంత్ టీడీపీ మిత్రుడు కాబట్టి.. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో మంత్రిగా చేరితే చేరోచ్చని రఘునందన్ ఆరోపించారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు పెట్టవద్దని కార్యకర్తలను కోరుతున్నట్లు రఘునందన్ తెలిపారు.
Read Also: Hyderabad: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్