JP Nadda: ఐటీ రైడ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్లు.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ..‘‘ మిత్రమా మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇది న్యూ ఇండియా, రాజకుటుంబాల పేరుతో దోపిడి చేయడాన్ని ప్రజలు అనుమతించరు. మీరు పరిగెత్తడంలో విసిగిపోతారు, చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Bank Robbery: 15ఏళ్లలో 7 సార్లు బ్యాంకులో చోరీకి దొంగల యత్నం.. ప్రతి సారీ కుక్కలే పరిగెత్తించాయి
కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే.. అవినీతిపై చర్యలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రతీ పైసా వాసస్ ఇవ్వాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉంటోంది.
సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ వ్యవహారానికి పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఎంపీ ధీరజ్ సాహూ వ్యాపారాలతో ఏ సంబంధం లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌కి ఏటీఎంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒడిశా బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా ఈ పన్ను ఎగవేత సాధ్యం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!