PM Modi: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం నుంచి ఆయనకు సంబంధం ఉన్న మద్యం వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో ఏకంగా రూ. 353 కోట్ల నగదు బయటపడటం దేశాన్ని నివ్వెరపరిచింది.
డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.
Shivraj Singh Chouhan: నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు.
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ రోజు జరిగిన శాసనసభపక్ష నేత ఎన్నుకునే సమావేశంలో సీఎం అభ్యర్థిగా భజన్ లాల్ శర్మని ఎన్నుకున్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటతప్పాడు అంటూ విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ వివాదంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హోమంత్రికి చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు,
Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన…
Armur MLA Rakesh Reddy Fires on EX MLA Jeevan Reddy: తాను ఎవ్వరికీ భయపడను అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. తనను చంపడం ఎవరి తరం కాదని, అలాంటి పరిస్థితి వస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తానన్నారు. విదేశాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయని.. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్లో బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు.