Hijab: “ఇక మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు”.. కర్ణాటకలో హిజాబ్‌పై బ్యాన్ ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయబోతోంది. హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని త్వరలో ఉపసంహరించుకోనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థవంతమైన హిజాబ్ నిషేధం లేదని, మహిళలు తమకు కావలసినది ధరించవచ్చు అని అన్నారు.
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
REAF ALSO: Ivanka Trump: ఇజ్రాయిల్‌లో ట్రంప్ కూతురు.. అక్టోబర్ 7 బాధితులకు పరామర్శ..
‘‘ హిజాబ్‌పై నిషేధం ఇకపై లేదు. మహిళలు హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లొచ్చు. నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని నేను ఆదేశించాను. మీరు ఎలా దుస్తులు ధరించారు, ఏమి తింటారు అనేది మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి..?’’ అని మైసూర్‌లో జరిగిన ఓ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చెబుతున్నట్లు ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ అంతా బోగస్, బట్టలు, వేషం, కులం, మతం ఆధారంగా మనుషుల్ని విభజించాలని బీజేపీ చూస్తోందని, హిజాబ్‌పై నిషేధం ఎత్తివేయాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
2022లో ముఖ్యమంత్రి బి బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ వివాదం విద్యాలయాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ప్రభుత్వ నిర్ణయంపై ఓ వర్గం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో మతపరమైన ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.ఆ తరువాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!