బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు రామోజీ షణ్ముకాచారి మరణం బాధాకరం అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలో నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడిన నాయకుడు.. ఎమర్జెన్సీ సమయంలో పని చేసిన షణ్ముకాచారి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా, సంఘటనా మంత్రిగా పని చేశారు.. హిందూ వాహిని, భజరంగదళ్ కు సేవలందించారు.. నల్లగొండ జిల్లాలో పార్టీ విస్తరణకు కృషి చేశారు.. 2018 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నల్లగొండ అభ్యర్ధిగా పోటీ చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Salaar Overseas: 4 మిలియన్స్… ఈ రికార్డ్ టచ్ చేసే వాళ్లు ఉన్నారా? మళ్లీ ప్రభాస్ యే బ్రేక్ చేయాలా?
కరీంనగర్ జిల్లా ఇంఛార్జీగా కూడా కొనసాగారు అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ప్రేమగా షణ్ముఖ అన్న ( కొందరు జన్నన్న ) అని ఆప్యాయంగా పిలుచుకునే షణ్ముఖాచారి గత కొంత కాలంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడి నిన్న అర్ధ రాత్రి 1.30 గంటలకు హైదరాబాద్ కొత్తపేటలోని తన నివాసంలో వైకుంఠ ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వారి మరణం పార్టీకి తీరని లోటు.. షణ్ముకాచారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని బండి సంజయ్ పేర్కొన్నారు.