బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ను నిర్మలా సీతారామన్ సందర్శించారు.
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వారం రోజులు అవుతున్న కూడా ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకోలేకపోతుందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇవాళ రాజస్థాన్లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. మా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎవరూ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణం చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని అన్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు…
IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం…
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీగా చెప్పబడుతున్న ఈ కేసులో ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మోయిత్రాను విచారించింది. తాజాగా ఈ రోజు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్యానెట్ మొదటి నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ సమర్పించారు.
Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.