Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు విజయానికి పూర్తి క్రెడిట్ తీసుకోరు అని అన్నారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరాగాంధీ రాసిన లేఖను వరుణ్ గాంధీ పంచుకున్నారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి మూడోసారి ఈడీ సమన్లు..
‘‘నిజమైన నాయకుడికి మొత్తం జట్టు గెలుస్తుందని తెలుసు. ఎప్పుడూ పెద్ద మనసుతో విజయానికి క్రెడిట్ తీసుకోకూడదని తెలుసు’’ అని వరుణ్ గాంధీ అన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసిన విజయం గురించి స్మరించుకుంటూ, వరుణ్ గాంధీ..‘‘ ఈ రోజు భారతదేశం మొత్తం ఈ ఇద్దర్ని జాతీయసంపదగా భావిస్తోందని, వారికి వందనం చేస్తుంది’’ అని అన్నారు.
ఇటీవల కాలంలో బీజేపీకి వరుణ్ గాంధీ అంటీముట్టనట్లు వ్యవహిస్తున్నారు. పలు విషయాల్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కి దగ్గరవుతున్నట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇందిరాగాంధీపై ప్రశంసలు చేయడం గమనార్హం. గత నెలలో ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ పుణ్యక్షేత్రంలో రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మధ్య కొద్దిసేపు సమావేశం పజరిగింది. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరు నేతలు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఒక పేషెంట్ మరణించిన తర్వాత అమేథిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి లైసెన్సులను రద్దు చేయడంపై వరుణ్ గాంధీ సొంతపార్టీపైనే విమర్శలు చేశారు.