Hijab: హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్.. అలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ అంశం మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాజకీయ రచ్చను ప్రేరేపించింది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తేయడంపై కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని శనివారం సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
Read Also: Pakistan: కాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల్ని పంపేందుకు.. తన పోస్టును తగలబెట్టుకున్న పాక్ ఆర్మీ..
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులను జారీ చేయలేదని మీడియా ముందు సీఎం చెప్పారు. అయితే నిషేధాన్ని ముగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ముందుగా అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిజాబ్ బ్యాన్ ఎత్తేయాలనే అంశం కాంగ్రెస్ ఎజెండాలో ఉంది.
లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో సీఎం సిద్ధరామయ్య మైనారిటీ బుజ్జగింపులకు తెరతీశారని, కులాలు-మతాలుగా ప్రజల్ని కాంగ్రెస్ విభజించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు ముందు ఉంది. 2021లో డిసెంబర్ లో ఉడిపిలోని ప్రభుత్వ పీయూసీ కాలేజీలో ఆరుగురు బాలికను హిజాబ్ ధరించి తరగతులకు రావడంతో హిజాబ్ వివాదం మొదలైంది. మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ సమస్యగా మారింది.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!