Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Criticized The Bjp Government

దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు.. బండి సంజయ్‌ పై హరీష్‌ రావు ఫైర్‌

Published Date :January 29, 2022 , 5:22 pm
By NTV WebDesk
దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు.. బండి సంజయ్‌ పై హరీష్‌ రావు ఫైర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్‌ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్‌ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు…? ఇవ్వంది ఎవరు..? చెప్పాలన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవ్వరూ.. నోటిఫికేషన్లు ఇవ్వంది ఎవ్వరూ? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువా ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా అంటూ ఫైర్‌ అయ్యారు. బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి…మీ బీజేపీ హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా… అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: తెలంగాణ‌లో స్కూళ్ల రీఓపెన్‌.. విద్యాశాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌

బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో నిరుద్యోగ యువత ఎంత బాధపడుతుందో బండి సంజయ్‌ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందని తెలిపారు. తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355, సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648, డీసీసీబీలు 1571, టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ను.. భ‌ర్తీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాల‌ను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తుందన్నారు. ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్న నాన్‌ లోకల్‌ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకే వంద శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టిందన్నారు. 95శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ల‌భించేలా కొత్త జోన‌ల్ విధానాన్ని తీసుకువచ్చారు. దీనికి గాను 317 జీవోను విడుదల చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయితే దీనిప్రకారం , కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ఉందన్నారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతుందన్నారు.

Read Also: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: రేవంత్‌ రెడ్డి

మీ ప్రభుత్వం హయాంలో… రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ తో, రాష్ట్రపతి నిబంధనలకు లోబడి జీఓ నెంబర్ 317 వచ్చింది. అలాంటి దానిపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, విమర్శలు చేయడమే అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. ఉద్యోగ విషయాల్లో రాజకీయ లబ్ధి జరుగుతుంది అనుకుంటే వంద శాతం మోసపోయినట్టేనని … బండి సంజయ్ నీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మరని మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. నిరుద్యోగ భారత్ గా చేస్తున్నది..ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 20 న CMIE వెల్లడించింది. దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని తిరుగుతున్నారు. గత నెల డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా తెలిపిందన్నారు. ‘ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్‌ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది’ అని సీఎంఐఈ స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు.

Read Also: శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహం..భక్తి ఛానల్‌లో

దేశంలో, తెలంగాణలో నిరుద్యోగం ఎంత ఉందో కూడా వివరించింది. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని ఇది స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం శాత 7.91% ఉంటే తెలంగాణలో 2.2% మాత్రమే ఉంది అని వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. పోనీ దేశంలో ఉద్యోగాలు ఖాళీ లేవా అంటే లేనట్టు కాదు.. కేంద్రం లెక్కల్లో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆర్మీలో 2 లక్షలు, రైల్వేల్లో మూడు లక్షలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే అవి భర్తీ చేయమని మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి. దేశ యువత కోసం పోరాటం చేయండి. అంటూ హరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి.. గత 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2019 ఫిబ్రవరి 23 న 1,03,769 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగం వస్తుందనే ఆశతో దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మూడు సంవత్సరాలు కావస్తున్నా పరీక్ష పూర్తి చేయలేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎంత జనాభా… ఎంత మంది ఉద్యోగులు… మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? అని చూస్తే.. దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తెలంగాణ జనాభాలో 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బీహార్ లో 0.3 %, యూపీ లో 1%, బెంగాల్ 1.1%, గుజరాత్ 1.1 %, కర్ణాటక 1.2%, తమిళనాడు 2% జనాభా ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్నారు.అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని ఈ గణాంకాలు చెప్తున్నాయన్నారు.

Read Also: తెలంగాణ వచ్చినా.. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు: వీహెచ్‌

కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్ కు అమ్మేసింది. దీంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు LIC సహా అనేక కంపెనీల వాటాలను అమ్మేస్తోంది. ఎయిర్ ఇండియాను టాటా కి అప్పగించారు. కేంద్రం IDBI సహా 2 ప్రభుత్వ రంగ బ్యాంక్ లను ప్రైవేటికరణ చేస్తోంది. దీంతో వేలాది మంది రోడ్డున పడతారు.కేంద్రం విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా. కేంద్రం చర్యలతో ఉద్యోగాలకు ఎసరు రావడంతో పాటు sc, st, obc, ews అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరగతుల సాధికారత కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికి, అన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.వాస్తవాలన్నీ ఇలా ఉంటే… మీరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దివాలాకోరు మాటలను బీజెపీ నేతలు ఇకనైనా మానుకోవాలంటూ విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోరు, తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెస్తామంటే ఓర్వరు, దళిత బంధు విషయంలో అడ్డగోలు ఆరోపణలు చేస్తారు.. ఎందుకంత అక్కసు మీకు..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేయ‌రు.. ఇక్కడ మేం చేస్తే అడ్డుకుందామ‌ని చూస్తున్నారు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురారు, విభ‌జ‌న హామీల నెర‌వేర్చేందుకు ప్రయత్నించరని మండిపడ్డారు.

Read Also: శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలి: జీవన్‌రెడ్డి

గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ.. రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను బీజేపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థలు రాకుండా తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపిస్తుందన్నారు. దేశంలో ఏడేళ్ల లో కొత్తగా 7 ఐఐఐఎం లు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్న.. ఐఐటీలు 7 తెలంగాణకు కేటాయించినవి సున్న… ఐఐఐటీలు 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకు కేటాయించినవి సున్న.. 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు ఇచ్చినవి సున్న.. 84 నవోదయలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు సున్న..వీటిని రాష్ట్రానికి తెప్పించడం లో రాష్ట్రంలోని బీజీపీ ఎంపిల కృషి గుండు సున్నా. వాళ్ళు దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వరు.. కేంద్రం నుండి తెలంగాణకు అన్యాయం చేస్తారు.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేస్తూ..ఉన్న ఉద్యోగాలను లేకుండా చేస్తారంటూ హరీష్‌ రావు తీవ్రంగా విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • BJP vs TRS
  • central government
  • Minister Harish Rao
  • political news

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • LPG Cylinder Prices: యుద్ధం వేళ.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు.. ఎవరీ మోజ్తబా ఖమేనీ!

  • Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..

  • Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!

  • Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బీమా ఎంత? దుబాయ్ ఐకాన్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions