మేడారం జాతరపై కేంద్రం నిర్లక్ష్యం..కవిత ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు ఎమ్మెల్సీ కవిత.
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం శ్రీ కేసీఆర్ గారు మొత్తం ₹ 332.71 కోట్లను విడుదల చేశారు#Medaram #మేడారం pic.twitter.com/kqnLqa9rJ5
Also Read
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2022
స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం 332.71 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు.
గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కల్పించి, మేడారానికి జాతీయ హోదా తెచ్చి , ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ సంజయ్ ను డిమాండ్ చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!