తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువును ఎలా అందిస్తారు? సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలలను అన్నింటినీ మూసివేశారని రేవంత్ మండిపడ్డారు.
పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, చదువును దూరం చేసి గోర్లు- బర్లు- చేపలు ఇస్తున్నారన్నారు రేవంత్. విద్యకు పెట్టే నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు- సమాజం దృష్టిలో పెట్టుబడి. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని చిట్ చాట్ లో రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ మనువాది. ఉద్యోగాల భర్తీ లేకుండా- ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదురైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తేనే పేదలు బాగుపడతారు.
కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాకాలను చేపట్టారు.పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు. అయినా వాటిని మూసివేశారు. బయట పార్టీలు- పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయి- అయినా వాటిని నియంత్రణ చేయరు ఎందుకంటే ఆదాయం ఉంటుంది కాబట్టి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ని చేస్తే- ఆ పార్టీ పని ముగిసింది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారు.
ఆ కమిటీలు చూస్తేనే ఆపార్టీ దివాళా తీసిందని అర్థం అవుతోందన్నారు.
అసలు రాష్ట్రంలో రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా?అని నా అనుమానం. యూపీలో ఎంఐఎం ను కాదని.. ఎస్పీకి టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా…?నేను 420లతో చర్చించడానికి సిద్దంగా ఉన్నా.కేటీఆర్ సినిమా వాళ్ళతో మాత్రమే చర్చిస్తాడు కావొచ్చు. మేము దొరలం కాదని… చినజీయర్ స్వామి మాకు రియల్ ఎస్టేట్ కంపెనీ వారితో ఆహ్వానం పంపారు. మేము శూద్రులము,శివ భక్తులమని అవమానిస్తున్నారా? నేను ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని, ఎంపీని ఎవరో వచ్చి ఆహ్వానిస్తారా? సమానత్వం అని టైటిల్ పెట్టి- ఒక ఎంపీని- పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాకు రియల్ ఎస్టేట్ ఉద్యోగితో ఆహ్వానం పంపుతారా ?
మోడీ ఏమి భక్తుడో ఆయనకే తెలియాలి. చైనా విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్లడం ఏంటో!స్వామీజీ అంతగొప్ప కార్యక్రమం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా? దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమానత్వం కనిపించడం లేదు. చిన్నజీయర్ స్వామి దగ్గర రియలేస్టేట్ వ్యక్తులు ఉంటే ఆయన గౌరవమే తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చెట్లను నరకడంపై బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. డీఎస్ ది లక్కీ హ్యాండ్. ఆయన పీసీసీ గా ఉన్నప్పుడే కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. డీఎస్ వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలన్నారు రేవంత్.