Sudheer babu: తెలుగు, హిందీ భాషల్లో ‘మామా మశ్చీంద్ర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 11వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు బర్త్ డే! దాంతో అతను నటిస్తున్న సినిమాల పోస్టర్స్ బర్త్ డే విషెస్ తో వస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా సుధీర్ బాబు – హర్షవర్థన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ టైటిల్ ను ప్రకటించింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే పేరు ఖాయం చేశారు. విశేషం ఏమంటే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే సుధీర్ బాబు ఇప్పటికే బాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితుడు. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘బాఘీ’ చిత్రంలో సుధీర్ బాబు ప్రతినాయకుడిగా నటించి, ఉత్తరాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. దాంతో ‘మామా మశ్చీంద్ర’ను హిందీలోనూ విడుదల చేయాలనే నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు.
సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న దీనిలో అతను ఛాలెంజింగ్ పాత్రను పోషించనున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్నమైన కథను రెడీ చేశారు దర్శకుడు, నటుడు హర్ష వర్ధన్. ఈ సినిమాలో ఇంత వరకూ చూడని సరికొత్త అవతారంలో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రాక్ స్టార్ ను తలపించే గెటప్ లో సుధీర్ ఉన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం భాగస్వామ్య కానున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రఫి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
Also Read
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!