Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Sunny Leone Birthday Special 2

Sunny Leone : స’రసాల’ సన్నీ లియోన్!

Updated On - 06:38 AM, Fri - 13 May 22
By subbarao n
Sunny Leone : స’రసాల’ సన్నీ లియోన్!

శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.

కెనడాలో 1981 మే 13న కన్నుతెరచిన సన్నీలియోన్ కు భారతీయ మూలాలున్నాయి. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. కరెన్ జిత్ పేరును ‘సన్నీ’గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. సన్నీ బోల్డ్ గా నటించడమే కాదు, ఏదీ దాచుకోకుండా చెప్పేస్తుంది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిముద్దు రుచి చూశానని చెప్పిన సన్నీ లియోన్ 16వ ఏట ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ తో తొలిసారి శారీరక సుఖం అనుభవించానని చెబుతుంది. తనలో స్వలింగసంపర్క అభిలాష కూడా ఉందని అంగీకరించింది. వైద్యవృత్తిలో రాణించాలని నర్స్ కోర్సు చదివింది. కానీ, తన 19వ యేట పోర్న్ మూవీస్ లో నటించడానికి సిద్ధమయింది. అప్పటి నుంచీ పలు నీలి చిత్రాలలో సన్నీ లియోన్ అందచందాలతో ఆకట్టుకుంది. 2004లో సన్నీ లియోన్ ‘ద గర్ల్ నెక్ట్స్ డోర్’ సినిమాతో తొలిసారి మెయిన్ స్ట్రీమ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత నుంచీ నీలి చిత్రాల్లో నటిస్తున్నా ఆమె మనసు ఫీచర్ ఫిలిమ్స్ లో నటించడానికి ఉవ్విళ్లూరింది. తన పూర్వికులకు చెందిన భారతదేశంలో నటిగా తన సత్తా చాటాలనుకుంది. ‘జిస్మ్-2’తో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘షూటవుట్ ఎట్ వాడాలా’లో “లైలా….” సాంగ్ లో సన్నీ లియోన్ భలేగా మురిపించింది. “జాక్ పాట్, రాగిణి ఎమ్.ఎమ్.ఎస్.-2” హిందీ చిత్రాల తరువాత ‘వడకర్రీ’ తమిళ చిత్రంతో సౌత్ బాట పట్టింది.

తెలుగులో మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘కరెంట్ తీగ’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది సన్నీలియోన్. ఇందులో సంపూర్ణేశ్ బాబు కాబోయే శ్రీమతిగా కాసేపు కవ్వించింది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘పీఎస్వీ గరుడవేగ’లో “డియో డియో…” సాంగ్ లో కనువిందు చేసింది సన్నీ లియోన్. దక్షిణాది అన్ని భాషల్లోనూ సన్నీ చిందులతో విందు చేసి బల్ పసందుగా సాగింది. సన్నీ ప్రధాన పాత్రలో ‘వీరమదేవి’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. సన్నీలాంటి నీలిచిత్రాల సుందరి అలాంటి పవర్ ఫుల్ రోల్ పోషించడంపై కొన్ని విమర్శలూ తలెత్తాయి. ఏది ఏమైనా సన్నీలియోన్ ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లోనే చిందేసింది. కానీ, నటిగానూ తన సత్తా ఏమిటో చాటుకోవాలన్నదే ఆమె అభిలాష. అందులో భాగంగా కొన్ని సినిమాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం భర్త డేనియెల్ వెబర్, తన ముగ్గురు పిల్లలతో కలసి లాస్ ఏంజెలెస్ లో ఉంది. అమెరికన్ కేన్సర్ సొసైటీకి నిధులు సేకరించడంలోనూ, జంతుసంరక్షణలోనూ సన్నీ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. ప్రస్తుతం సన్నీ లియోన్ ఓ తెలుగు చిత్రంలోనూ, ఓ మళయాళ సినిమాలోనూ, మూడు తమిళ, మూడు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. మరి రాబోయే చిత్రాలలో సన్నీ ఏ రీతిన తన అభినయంతో ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Tags
  • birthday special
  • bollywood industry
  • hot beauty
  • Sunny Leone

RELATED ARTICLES

Vijay : విజయ్ విజృంభణ సాగేనా!?

Paruchuri :గురువృద్ధుడు… పరుచూరి అగ్రజుడు!

sampath nandi director మళ్ళీ ‘రచ్చ’ కోసం సంపత్ నంది!

Tulasi : భలేగా మెప్పించిన తులసి!

Kajal : కనికట్టు చేసిన కాజల్!

తాజావార్తలు

  • Uddhav Thackeray: మహా సంక్షోభానికి ఆ ఇద్దరు మహిళల శాపనార్ధాలే కారణమా..?

  • Jayamma Panchayati : ఢీలా పడిన ‘లేడీ’ ఓరియెంటెడ్ మూవీస్!

  • Suriya : ‘విక్రమ్’ తరువాత రోలెక్స్ సార్ ఎక్కడున్నారో తెలుసా..?

  • Stock Markets: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం

  • CM Jagan LIVE | Marque companies in Electronic Manufacturing Cluster-I, TCL Inauguration LIVE | Ntv

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions