యువ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలోని అతని గెటప్ ను రివీల్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవల అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజున కూడా చిత్ర దర్శక నిర్మాతలు ఇదే పనిచేశారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ”సుడిగాలి సుధీర్ బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. రీసెంట్ టైమ్‌లో సిల్వర్ స్క్రీన్‌పై తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సుధీర్. ఆయన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘వాంటెడ్ పండుగాడ్’లో సుధీర్ నటన అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మూడు, నాలుగు రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం” అని అన్నారు.