నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన…
సుమంత్, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’. రాజ్ క్రియేషన్స్ పతాకంపై యెక్కంటి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. బుధవారం సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ను విడుదలచేశారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టినరోజు…
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ…
పసిమి ఛాయ, చారెడేసి కళ్ళు, కొనదేలిన ముక్కు, దొండపండులాంటి పెదాలు, ఇలా వర్ణించుకుంటూ పోతే మౌనుల నిగ్రహానికి సైతం పరీక్ష పెట్టే విగ్రహం వై.విజయ సొంతం. తెరపై వై.విజయను చూడగానే ‘పులుసు’ అంటూ కేకలు వేసేవారు జనం. “మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య” చిత్రాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొనే పాత్రలో కనిపించారు వై.విజయ. అప్పటి నుంచీ ఆ పేరుతోనే ‘పులుసు’ విజయగా జనం మదిలో నిలచి…
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల…
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు…
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో…
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…
ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు…