Rashmika: ఇంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికే దుల్కర్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక ఒక కాశ్మీర్ ముస్లిమ్ యువతి అఫ్రీన్ గా కనిపించనుంది.
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల మధ్య తగలబడుతున్న కార్ల దగ్గర భయం లేకుండా నిలబడిన రష్మిక లుక్ ఆకట్టుకొంటుంది. ఇక ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో అమ్మడు నటిస్తోంది. ఎప్పటి నుంచో అందరు అనుకున్నట్లే దళపతి 66 లో అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కోలీవుడ్ హీరో విజయ్ సరసన రష్మిక నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యింది. త్వరలోనే ఈ సినిమ షూటింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని రష్మిక తెలుపుతూ” ఇంతకంటే బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాలతో రష్మిక రేంజ్ ఎలా మారుతుందో చూడాలి.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!