Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు S. S. Rajamouli తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ ప్లానింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరెకెక్కుతున్న రామాయణ కంటే ముందుగా విడుదల చేయాలనే అనుకున్నారట. అయితే రామాయణం ఇప్పటికే రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సీజన్లను లాక్ చేసుకోవడంతో, దానికి దాదాపు ఆరు నెలల గ్యాప్ ఉంచి వరణాసిని విడుదల చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేసినట్లు టాక్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Also Read : NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్
Also Read
- JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
- Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన 'రన్ మెషిన్'.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
- గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
లేటెస్ట్ గా రెబల్ స్టార్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మార్చిలో రిలీజ్ కానుండటంతో పాన్-ఇండియా స్థాయిలో ప్రబాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్పిరిట్ భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశముంది. అంటే స్పిరిట్ కేవలం వరణాసి విడుదలకు కేవలం నెల రోజుల ముందు మాత్రమే వస్తుంది. స్పిరిట్ హిట్ అయితే వారణాసికి అనుకున్నంత ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు. బాలీవుడ్ లో హిట్ టాక్ వస్తే నెలల తరబడి రన్ ఉంటుంది. ఒక పెద్ద సినిమా చుసిన ఆడియెన్స్ వెంటనే మరొక భారీ సినిమా కోసం థియేటర్స్ కు పరిగెత్తరు. ఆ ప్రభావం కూడా వారణాసికు ఉంటుంది.
ఇక వారణాసి విషయానికి వస్తే సుమారు రూ. 1200, రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వారణాసి రికవరీలో పెద్ద భాగం రాజమౌళి బ్రాండ్ విలువపైనే ఆధారపడనుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆయనపై ఉన్న అంచనాలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఈ సినిమాను లాభాల్లోకి తీసుకురావాలంటే అగ్రెసివ్ మార్కెటింగ్, గ్లోబల్ ప్రమోషన్స్ కీలకం కానున్నాయి. మొత్తానికి వరణాసి రిలీజ్ టైమింగ్ చుట్టూ ఏర్పడిన ఈ పరిస్థితులు ఇండియన్ సినిమా వ్యాపార దిశను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. రాజమౌళి టీమ్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!