Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించుకున్నారు. తన పెళ్లి తర్వాత మొదటిసారి భార్య రష్మిక మందన్నతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మెన్‌పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి, గ్రామస్థులందరికీ విందు ఏర్పాటు చేశారు. అక్కడ గ్రామస్థులతో మాట్లాడుతూ విజయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.. ‘సొంతూరితో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవాలని మా నాన్న కల కనేవారు, ఆ కల ఇప్పుడు నెరవేరింది. నా పెళ్లి జరగడం, అదే సమయంలో ఇల్లు పూర్తికావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు..
Also Read : Tumbbad-2 :తుంబాడ్ 2 లో సెన్సేషనల్ యాక్టర్..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
గ్రామ అభివృద్ధిపై తనకున్న విజన్‌ను పంచుకుంటూ.. ఇకపై ఊరికి రెగ్యులర్‌గా వస్తానని, తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా గ్రామస్థులందరి సమక్షంలో ఇక్కడే ఘనంగా చేస్తానని మాటిచ్చారు. అలాగే సామాజిక బాధ్యతగా తన ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్‌కు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెళ్లి తర్వాత తన సొంత ఊరికి ఇంతటి గొప్ప కానుకను అందించిన విజయ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘విరోష్’ (ViRosh) జంట మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!