సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే....
వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బైక్‌లపై లాంగ్ డ్రైవ్‌లు వెళ్లడానికి కొందుకు ఇష్ట పడుతుంటారు. రోజువారీ అవసరాలకు బైక్‌పై తిరిగే వారు మాత్రం అసౌకర్యాలు ఎదుర్కొంటారు. అయితే ఈ సీజన్‌లో ఎవరైనా సరే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జనవరి 20న 50 ఏళ్ల ఈ-రిక్షా డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి రోడ్డుపై తిరిగారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో…
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.
Best Mileage 150-160cc Bikes in India: భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 30 పెరిగి రూ. 110కి చేరింది. ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేనంత ఖరీదైనదిగా మారాయి. దాంతో సామాన్య ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంచి మైలేజ్ ఇచ్చే 150సీసీ-160సీసీ బైక్ కొనాలనుకునే వారికి ఈ సమాచారం ఉపయోగపడనుంది.…
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. క్రికెట్ కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.. ఒకవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.. అంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నా కూడా అభిమానులతో సొంతం మనిషిలాగ కలిసిపోతాడు.. ఇదిలా ఉండగా ధోనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం…
Here is Best Tips To Increase Bike Mileage: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్.. భారత ఆటో మార్కెట్లో చాలానే ఉన్నాయి. బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీలకు చెందిన పలు మోడళ్లు అధిక మైలేజ్‌ను ఇస్తాయి. సామాన్య ప్రజలు కూడా ఈ అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లనే కొంటారు. అయితే కొన్నిసార్లు బైక్ మైలేజ్ బాగా తగ్గిపోతుంది. ఇందులో బైక్ నడిపే వారి తప్పు కూడా ఉంటుంది. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మెరుగైన…