రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
Viral Video: ఏంటి తల్లి నీకు భయమేస్తాలేదా.. పైథాన్ను అలా పట్టుకున్నావేంటి..
ఈ వీడియోను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. బైక్ నడపడంలో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా.. ఉంది. అతను బైక్ నడుపుతుండగా ఇద్దరు మహిళలు వెనుక కూర్చున్నారు. ముందు బైక్ ట్యాంక్ పై మరో మహిళ కూర్చోని ఉంది. ఓ హైవేపై ముగ్గురు మహిళలను బైక్ పై ఎక్కించుకుని.. అది కూడా ఒకరు ట్యాంక్ పై కూర్చో బెట్టుకుని వెళ్తున్నాడు. అది చూసిన రోడ్డుపై వెళ్తున్న జనాలు ఆశ్చర్యపోయారు. అయితే.. ఆ వీడియోను రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Valentine Day Scams: ప్రేమికులకు అలర్ట్.. ఆన్‌లైన్ బహుమతుల విషయంలో తస్మాత్ జాగ్రత్త!
ఈ వీడియోని అంకిత్ అనే వ్యక్తి తన ఖాతా @terakyalenadena నుండి మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేసారు. ఇప్పటికే ఈ వీడియోను 67 వేల మందికి పైగా చూశారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు.. సోదరా, నేను సిగ్గుతో చనిపోతానని రాశారు. మరొక వినియోగదారు.. ఇది యానిమల్ చిత్రానికి చెందిన బాబీ డియోల్ అని రాశారు.
India is not for beginners 😂🔥 pic.twitter.com/IIPalGYJMd
— Ankit (@terakyalenadena) February 13, 2024