బైక్ స్టంట్ చేసేవారు వివిధ రకాలుగా బైక్స్‌ను నడుపుతుంటారు. బైక్‌పై నిలబడి, పడుకొని, ముందు చక్రాన్ని ఎత్తి, లేదా వెనుక చక్రాన్ని గాల్లో నిలబెట్టి బైక్ నడుపుతూ స్టంట్ చేస్తుంటారు. బైక్ పై ఎన్ని విన్యాసాలు చేసినా రివర్స్‌లో నడపడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. కానీ, ఆ కష్టమైన దాన్ని ఓ వ్యక్తి ఇష్టంగా చేసి చూపించాడు. తన తెలివికి పదునుపెట్టి స్కూటీకి రెండు వైపులా హ్యాండిల్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు.…
మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్లకు పైగా ప్రయాణించింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో బైక్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. డ్రైవర్ లేకుండా బైక్ దూసుకెళ్లడం ఏంటనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే… వేగంగా వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. కానీ, బైక్ మాత్రం 300 మీటర్లు ప్రయాణించి రోడ్డుపై పడిపోయింది. ఎవరికీ ప్రమాదం…
పూణేలో వింతఘటల చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ బైక్ దాదాపుగా 300 మీటర్లు ప్రయాణం చేసింది. వేగంగా వస్తున్న బైక్ రోడ్డుపై నడుస్తున్న పాదచారుడిని డీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడినప్పటికీ ఆ బైక్ మాత్రం ఆగలేదు. 300 మీటర్లమేర రోడ్డుపై ప్రయాణం చేసి ఎదురుగా వస్తున్న మినీ లారీకి తగిలి కిందపడింది. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. …
ట్రాఫిక్ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి… వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్ 34 డీ 2183 నంబర్ గల బైక్ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు…
విశాఖలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగ్లర్లు వేగంగా నడుపుతూ చెక్ పోస్ట్ గేటును బైక్ తో కొట్టారు. ఈ ఘటనలో గంజాయి బ్యాగుతో పాటు కిందపడ్డ వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అతడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న దుండగుడు తప్పించుకున్నాడు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటి చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యం సీసీటీవీ లో…
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మమతా మోహన్ దాస్ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఏ భాషనైనా అవలీలగా పలికేయడం మమతా మోహన్ దాస్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ పొడుగు కాళ్ళ సుందరి ఎంచక్కా తెలుగులోనూ పలు చిత్రాల్లో పాటలు పాడేసింది. ఇక నటిగానూ మురిపించిన మమతాలో గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉంది. క్యాన్సర్ ను జయించి మరి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన మమతను మెచ్చుకోని వారే ఉండరు. ఇదిలా ఉంటే…
ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. రాత్రి సమయాలలో పాల్పడే బైక్ రేసింగ్లు కోవిడ్ వల్ల అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ విధించడం తో ఆదివారం సాయంత్రం సమయంలో బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నారు రేసర్లు. అతి వేగంగా రోడ్ల పై 30 నుండి 40 వాహనాలతో రేస్…