Best Mileage 150-160cc Bikes in India: భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 30 పెరిగి రూ. 110కి చేరింది. ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేనంత ఖరీదైనదిగా మారాయి. దాంతో సామాన్య ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంచి మైలేజ్ ఇచ్చే 150సీసీ-160సీసీ బైక్ కొనాలనుకునే వారికి ఈ సమాచారం ఉపయోగపడనుంది.
Honda SP160/Unicorn:
ప్రముఖ కంపెనీ ‘హోండా’ ప్రస్తుతం 150-160సీసీ సెగ్మెంట్‌లో యునికార్న్, ఎస్‌పీ160లను విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ 162.7సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తున్నాయి. యునికార్న్ బైక్ 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా.. ఎస్‌పీ160 బైక్ 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
TVS Apache RTR 160:
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ 159.7సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 15.82bhp మరియు 13.85Nm ప్రొడ్యూస్ చేస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 బీకే 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.
Bajaj Pulsar N160:
యువత ఎక్కువగా ఉపయోగించే బైక్ బజాజ్ పల్సర్. సూపర్ లుకింగ్, మైలేజ్ కారణంగా ఇది బాగా పాపులర్ అయింది. బజాజ్ పల్సర్ ఎన్160 51.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పల్సర్ ఎన్160 ధర రూ. 1.33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Also Read: IPL 2024: అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’గా హార్దిక్ పాండ్యా!
Hero Xtreme 160R:
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ 160సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8,500rpm వద్ద 15bhp మరియు 6,500rpm వద్ద 14Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 49 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
Bajaj Pulsar N150:
బజాజ్ పల్సర్ ఎన్150 శక్తివంతమైన మోడల్. పల్సర్ ఎన్160తో పోలిస్తే.. ఇది తక్కువ మైలేజీని అందిస్తుంది. కొత్త రకం 150సీసీ పల్సర్ 47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.