Kurnool Bus Accident: 19 మంది సజీవ దహనం అయిన కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.. ప్రమాద తీవ్రత పెంచడంలో బైక్‌లో పెట్రోలు, బస్సులోని డీజిల్‌తో పాటు.. లగేజీ కేబిన్‌లో ఉన్న సెల్ ఫోన్ల పాత్ర కీలకంగా భావిస్తున్నారు.. బైక్ ను ఢీకొన్న బస్సు.. బంపర్‌లో చిక్కుకుపోయిన బైక్‌ను 300 మీటర్ల వరకు ఈడ్చుకు పోవడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి బస్సు కింద రోడ్డు పొడవునా పెట్రోల్ పడడంతో…
Vizag Road Accident: తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని మసులుకునే పిల్లలు కొందరైతే.. తమనకు ఏది కావాలన్నా మారం చేసి సాధించుకునేవారు మరికొందరు.. ఇంకో వైపు, తన పిల్లల కోసం ఎంత కష్టానైనా భరించి.. వాళ్లకు మెరుగై జీవితాన్ని అందించాలనే భావించే పేరెంట్స్ ఉన్నారు.. తమ జీవితంలో సాదాసీదాగా బతుకుతున్నాం.. మా పిల్లలు అయినా అన్ని చూడాలి అని తాపత్రయ పడే తల్లిదండ్రులు ఉన్నారు.. అయితే, దసరా రోజు 3 లక్షల రూపాయల అప్పు చేసి బైక్…
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి నవతోజ్ సింగ్ దుర్మరణం చెందారు. హరినగర్ నివాసి అయిన నవతోజ్ సింగ్ ఇంటికి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇద్దరు వ్యక్తులు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య యూరియా టోకెన్ల కోసం బొద్దుగొండ వస్తుండగా ద్విచక్ర వాహనం, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ వాల్య మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు…
ప్రస్తుత కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన బైక్, కారు ఇప్పించలేదని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా తట్టుకోలక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి…
పాము.. ఆ పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది. అలాంటిది తుప్పల్లో, పుట్టల్లో ఉండే పాములు ఇంట్లోకి వస్తే భయంతో పరుగులు తీయాల్సిందే. పాము కాటుతో ప్రాణాలకే ప్రమాదం. అప్పుడప్పుడు ఇళ్లలోకి చేరి హల్ చల్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో షూస్, హెల్మెట్స్, బైక్ లలో పాములు దూరిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బైకులోకి పాము దూరింది. ఈ విషయాన్ని గమనించిన బైక్ ఓనర్ మెకానిక్…
ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. 9 నెలల క్రితం పెళ్లైన ఓ యువతి లైఫ్ లో అనుకోకుండా జరిగిన సంఘటన జీవితమే లేకుండా చేసింది. పెళ్లై ఏడాది గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బైక్ పై వెళ్తుండగా మెడకు ఉన్న చున్ని వెనక చక్రంలో చిక్కుకోవడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనకాపల్లిలో జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి పూర్తి…
నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. రాయ్‌బరేలిలోని లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ పెళ్లి కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తులు.. ఎగిరి ఆటోపై పడ్డారు. కారు మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.