సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే….
Read Also: Women Misbehavior : విమాన భద్రతా సిబ్బందిని కొరికిన మహిళ.. చివరకి..
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్‌పై ఏడుగురు పిల్లలను కూర్చోబెట్టుకుని బండిని నడుపుతున్నాడు. యువకుల ప్రాణాలను లెక్కచేయకుండా.. ప్రయాణం కొనసాగించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. ఈ వీడియో చూసిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనికి రూ. 9500 చలాన్ విధించారు. అయితే… ఈ వీడియోను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
Read Also: AP: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే?
మరోవైపు.. ఈ వీడియోపై స్పందించిన హాపూర్ జిల్లా పోలీసులు బాధితుడికి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని ప్రజలకు సూచించారు. కాగా.. సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని జనాలు.. దేనిని వదలడం లేదు. చివరకు ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా అదే చేస్తున్నారు.