అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లను టెంప్ట్ చేసేలా బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వెహికల్స్, ఈవీలపై కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త బైక్ లను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. టూవీలర్స్ పై రూ 15…
దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది.
TVS మోటార్ కంపెనీ కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరకు లభించనుంది. TVS రేడియంట్ ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు ఎంఎస్.ధోనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి నడుపుతూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూసి ఆయన అభిమానులకు సంబర
మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్‌పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్‌ను తొలగించారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. 11 కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో తెగి బైక్ పై పడగానే బైక్ తో పాటు పూర్తిగా ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు.
బైక్‌లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది.
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
శనివారం పూణె-నాసిక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడు ప్రయాణిస్తున్న కారు రాత్రి ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. పూణే జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్. దిలీప్ మోహితే పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్…