బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది.…
రోడ్డు వేయిస్తాం నయా నగరాన్ని స్థాపిస్తాం ఇది ప్రతి నాయకుడు చెప్పేమాటలే. కానీ.. వారి మాటలు మాటలకు మాత్రమే పరిమితం మవుతున్నాయి. అడపాదడపా రోడ్డు వేయింది. చేతులు దులుపుకుంటారు. కానీ.. వర్షం వస్తే గాని ఆరోడ్డు పరిస్థితి అప్పటివరకు తెలియదు. వాన జల్లులతో గుంతలు, రోడ్డులో రాళ్లు అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు నగరవాసులకు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దేశంలోనే ఇలాంటివన్నీ సాధారణంగా మారాయి. కానీ ఎప్పుడైనా ఖాళీ లేకుండా ఉన్న గుంతల వరుసలు వున్న రోడ్డును చూశారా. చూడకపోతే…
బిహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా జిల్లాలో ఇద్దరు, ఖగారియా జిల్లాలో ఇద్దరు, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. బిహార్ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.…
దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలు ఎంతో అవసరం.. దేశాన్ని రక్షించేందుకు బోర్డర్‌కు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నవారే.. ఇప్పుడు దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.. ఆర్మీలో చేరడమే మా కల.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం అంటున్న అభ్యర్థులు.. ఆందోళనకు దిగి విధ్వంసమే సృష్టించారు.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, అగ్గి రాజేసింది మాత్రం అగ్నిపథ్ పథకమే అని చెప్పాలి.. సైన్యం రిక్రూట్మెంట్లో కీలక మార్పులు చేస్తూ, ‘అగ్నిపథ్’ పేరిట కొత్త పథకానికి కేంద్ర…
దేశంలో ‘అగ్నిపథ్’ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై ఆర్మీ ఆశావహుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రారంభం అయిన ఆగ్రహ జ్వాలలు మెల్లిగా దేశం మొత్తం పాకుతున్నాయి. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల కాలపరిమితితో ఈ అగ్నిపథ్ స్కీమ్ రావడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతున్నారు. అగ్నిపథ్…
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్‌లో మొదట అగ్నిపథ్‌పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.…
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘ అగ్ని పథ్’ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత కొంతమంది ఈ స్కీమ్ ను వ్యతిరేఖిస్తున్నారు. ప్రస్తుతం బీహర్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ ఆశావహులు తీవ్ర ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ట్రాకులపై టైర్లు వేసి కాల్చారు. మూడు రైళ్ల బోగీలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. చాప్రా, గోపాల్…