Lightning strikes: పిడుగుల బీభత్సం.. యూపీలో 14 మంది, బిహార్‌లో 5గురు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning strikes: ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.రిలీఫ్ కమిషనర్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. పిడుగుపాటు కారణంగా బండాలో నలుగురు, ఫతేపూర్‌లో ఇద్దరు, బల్రాంపూర్, చందౌలీ, బులంద్‌షహర్, రాయ్ బరేలీ, అమేథి, కౌశాంబి, సుల్తాన్‌పూర్ మరి, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పిడుగుపాటు గురై చనిపోయిన వారికి సీఎం ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల చొప్పున అందించాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించినట్లు ఓ ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Volleyball in Flood water: వరద నీటిలో వాలీబాల్.. ఎక్కడో తెలుసా?
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
మరోవైపు బిహార్‌లో పిడుగుపాటుకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు కారణంగా ఐదుగురు మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో పిడుగుపాటుకు 5 మంది మృతి చెందడం బాధాకరమని, మృతులపై ఆధారపడిన వారికి తక్షణమే రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామని, జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం.. సివాన్‌లో ఒకరు, సమస్తిపూర్‌లో 1, గయాలో 1, ఖగారియాలో 1, సరన్‌లో 1 పిడుగుపాటు కారణంగా మరణించారు. ఇదిలా ఉండగా.. జులై 20 , 21 తేదీలలో ఒడిశా, బిహార్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!