house collapses due to blast: భారీ పేలుడు.. ఇల్లు కూలి ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
house collapses due to blast: బిహార్‌లోని సరన్ జిల్లా ఛప్రాలో భారీ పేలుడు సంభవించింది. చఫ్రాలో ఓ ఇంట్లో ఆదివారం జరిగిన పేలుడు కారణంగా ఇల్లు కూలి ఆరుగురు మరణించారని జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పేలుడు గల కారణాల గురించి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఛప్రాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆరు అంబులెన్సులు, సహాయక బృందాలు మోహరించారు.
Philippines shooting: యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
Also Read
- Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
- Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
- Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు
- Police to Arrest TDP Ayyanna Patrudu Live : అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం..
ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోదైబాగ్ ప్రాంతంలో రియాజ్ మియాన్ అనే వ్యక్తి ఇంట్లో ఇవాళ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. ఇల్లు నామరూపాలు లేకుండా మారిపోయింది. పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. రియాజ్ మియాన్ ఒక బాణసంచా వ్యాపారి, అతను వివాహాల సమయంలో అక్రమంగా పటాకులు అమ్మేవాడు. ఆ ఇల్లు అక్రమ పటాకుల తయారీ యూనిట్ పోలీసులు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఇల్లు ధ్వంసం కావడమే కాకుండా పక్కనే ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. పక్కనే ఉన్న ఆరుకు పైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంత భారీ పేలుడు ఎలా జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?