Indigo Flight Emergency Landing: బాంబు ఉందంటూ ప్రయాణికుడు హల్‌చల్.. తనిఖీ చేయగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో ప్రయాణం చేయాలంటే చాలా మందికి భయం ఉంటుంది. విమానం సేఫ్ గా టేక్ ఆఫ్ కావడం మొదలు అంతే సేఫ్ గా ల్యాండ్ అయ్యే వరకు గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే విమానం ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఏ విపత్తు వచ్చినా మన చేతుల్లో ఉండదు కాబట్టి. ప్రయాణ భయమో మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఓ ప్రయాణికుడు విమానం టేక్ ఆఫ్ అయిన తరువాత తన బ్యాగులో బాంబు ఉందంటూ హల్ చల్ చేసాడు. దీంతో ఆవిమానంలో తోటి ప్రయాణికుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఘటనే ఇండిగో ఫ్లైట్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెలితే.. బిహార్ లోని పట్నా ఎయిర్పోర్ట్ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో 6e 2126 విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని తోటి ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేసి, వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. ఈవిషయం బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసులకు తెలుపడంతో.. హుటాహుటిన విమానం వద్దకు చేరుకుని ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు గుర్తించారు. అయితే.. విమానంలో ప్రయాణిస్తుండగా బాంబు ఉన్నదని బెదిరించిన వ్యక్తిని రిశి చాంద్ సింగ్‌గా గుర్తించి, అతనిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆవ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు. కాగా.. పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. బాంబు బెదిరింపులు చేయగానే వెంటనే ఆ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసి, గాలింపులు జరిపించామని.. ఆ విమానంలో బాంబు కనిపించలేదని తెలిపారు. ఇప్పటి వరకు విమానంలో ఏదీ కనిపించకున్నా, ప్రొటోకాల్ ప్రకారం గాలింపులు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ఈ విమానాన్ని రద్దు చేసి, రేపు ఉదయం ఈ విమానం మళ్లీ ప్రయాణం చేస్తుంది.
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
KL Rahul: అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు.. కరోనా ముద్దాడింది
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!