బీహార్లో కులాల వారీగా జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ తాజాగా డిమాండ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారని.. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన…
పిల్లలు అంటే తల్లితండ్రులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి వారు ఏమి చేసినా అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత కష్టం వచ్చినా వారికి చెప్పకుండా వారు జీవితంలో ఏం కావాలనుకుంటారో దానికోసం కష్టపడుతుంటారు. అయితే కొంతమంది తండ్రులు మాత్రం కసాయిలుగా మారుతున్నారు. వారు చెప్పిన మాట వినకపోతే కర్కశంగా కన్నబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా ఒక కసాయి తండ్రి, కూతురు చెప్పిన మాట వినలేదని అతి దారుణంగా కొట్టి చంపిన ఘటన బీహార్…
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోతున్న మొదటి భార్య చేసిన పనికి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. బీహార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్బాజార్కు ఖుర్షీద్ ఆలం అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం బీబీ పర్వీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. అయితే, ఎంతకీ వారికి సంతానం కలగకపోవడంతో.. పిల్లల కోసం రెండు సంవత్సరాల క్రితం రోష్మి ఖతూన్ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్.…
పాట్నాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి పెట్టే హింసల్ని తాళ్ళలేక, ఆ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనని కాపాడని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులకు ఆ వీడియో చేరడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు(50) సమస్తిపూర్లోని రోసెరా ప్రాంతంలో…
బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం…
బీహార్లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో…
గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరుతున్నారని హడావుడి చేశారు. ఇంతలో అదేం లేదని పీకే తేల్చేశారు. మరోవైపు, ఆయన ఇప్పటికీ టీఎంసీ, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విటర్లో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. ప్రశాంత్ కిశోర్ తన తాజా ట్వీట్ ద్వారా పార్టీ స్థాపించే సంకేతం ఇచ్చానిపిస్తోంది. ఐతే అది ఎప్పడు…
ఇప్పుడు దేశమంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగుల గురించే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని, తన సత్తా ఏంటో…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై ఆధారపడే నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.. బీహార్లో కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కల్తీ మద్యం తాగి మృతిచెందేవారి సంఖ్య కూడా పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించిన ఆయన.. వారిని భారతీయులుగా తాను భావించనని పేర్కొన్నారు..…